Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసులభతరంగా 'వాహన్‌' ప్రక్రియ

సులభతరంగా ‘వాహన్‌’ ప్రక్రియ

- Advertisement -

– వెయ్యి మంది డీలర్లకు శిక్షణ
– 671 మందికి అనుమతులు
– పోర్టల్‌ ద్వారా 33 వేల రిజిస్ట్రేషన్లు
– ఇదో డిజిటల్‌ ముందడుగు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రవాణాశాఖలో అనేక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ప్రధానంగా వాహానాల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు తమిస్తున్నది. ఇందుకోసం వాహన్‌ పోర్టల్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ సేవలు ఇప్పటికే వేగంగా అందు తున్నాయి. సారథి, వాహన్‌ పోర్టళ్ల ద్వారా జరిగే సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నాయి. దీనికి సంబందించిన శిక్షణా కార్యక్రమాలను రవాణా శాఖ పూర్తిచేసింది. నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఈ ఏడాది మార్చి 26 నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది విజయవంతంగా కొనసాగుతున్నదని రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పౌరులు, వినియో గదారులకు ఈ సేవలు పెంచి ప్రభుత్వ ఆదాయాన్ని సైతం అధికంగా రాబట్టాలని అధికార యంత్రాం గం భావిస్తున్నది.

ఈమేరకు ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానిం చారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సేవలు నాణ్యంగా అందించడం ద్వారా ఆదాయాన్ని సైతం పెంచ వచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ గత కొంతకాలంగా 1000 మంది డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 671 మంది డీలర్లు అనుమతులు తీసుకుని వాహన్‌ పోర్టల్‌లో చేరారు. అలాగే 346 ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇతరులు వాహన్‌ పోర్టల్‌లో చేరారు. ఈ పోర్టల్‌తో రాష్ట్రవ్యాప్తంగారవాణా శాఖ సంబంధిత సేవలు వికేంద్రీ కృతమవుతాయి. వాహన్‌ పోర్టల్‌ను దశలవారీగా మరింత అభివృద్ధి చేయడానికి రవాణా శాఖ కృషి చేస్తున్నది. పోర్టల్‌లోని మాడ్యూళ్లను సైతం ఎప్పటి కప్పుడు తాజా పరుస్తూ ముందుకుపోవాలని రవాణా శాఖ భావిస్తున్నది.

పోర్టల్‌ ద్వారా డిజిటల్‌ సేవలను సమర్థవంతంగా, కచ్చితంగా, విశ్వసనీయంగా అమలుచేయాలని నిర్ణయించింది. గత మార్చి నుంచి ఇప్పటివరకు ఈ పోర్టల్‌ ద్వారా సుమారు 33 వేల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిర్వహించింది. కేవలం 17 రోజుల్లోనే పోర్టల్‌ ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. పరివాహన్‌ యాప్‌ ద్వారా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లగనుంది. అదనపు సేవలను సైతం దశలవారీగా ఈ యాప్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇదో కీలక ముందడుగు కానుంది. ఈ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ రవాణా శాఖలో పారదర్శకంగా సేవలు అందించడానికి వీలవుతుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది. వాహన్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారులకు డిజిటల్‌ సేవలను పెంచుతామని రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబరితి అభిప్రాయపడ్డారు. కొత్త ఆదాయమ మార్గంగా కూడా ఉపయోగపడుతుందన్నారు .వినియోగదారులకు సమయాన్ని మిగల్చడానికి కచ్చితంగా వాహన్‌ పోర్టల్‌ ఉపయోగపడుతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -