నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం రోజు మినీ మీటింగ్ హల్ సమావేశం మందిరంలో డి ఎఫ్ ఓ సుధాకర్ రెడ్డి అధ్యక్షత న జరిగిన సమావేశం లో స్థానిక సంస్థ ల జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16.72లక్షలు మొక్కలు నాటాలన్నారు. మొత్తం మొక్కలు నాటెందుకు సిద్ధం చేశారని తెలిపారు. డి ఆర్ డి ఏ, అటవీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, జిల్లా పంచాయతీ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మున్సిపాలిటీ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ తమకిచ్చిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
2026 జూన్ మాసంతంలోగా ప్లాంటేషన్ లకు సంబంధించిన ప్రదేశాలను గుర్తించి, వెంటనే ముందస్తూ పనులను చేపట్టి జులై మాసంలో మొక్కలు నాటుటకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటిలలో పచ్చదనం తక్కువగా ఉన్నందున మరియు మొక్కలు నాటే ప్రదేశాలు కూడా తక్కువ కాబట్టి వాటిని గుర్తించి, ఎత్తైన మొక్కలు హెచ్ఎండిఏ వారిని పొంది నాటగలరని కోరారు.
జిల్లాలోని అన్ని మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రదేశాలు టీ జి ఎఫ్ ఎం ఐ ఎస్ వెబ్సైట్ లో జియో-కోఆర్డినేట్ లతో నమోదు చేయాలని ఆన్నారు. ఈ సమావేశం లో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి అధికారులు, వివిధ జిల్లా అధికారులు మరియు మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.



