Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ప్రజల తీర్పు చారిత్రాత్మకం

జూబ్లీహిల్స్‌ ప్రజల తీర్పు చారిత్రాత్మకం

- Advertisement -

కొనగాల మహేశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో, రెండేళ్ల ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించి, రికార్డు మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిపించిన తీరు చారిత్రాత్మకమని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌. కొనగాల మహేష్‌ కొనియాడారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 24,729 భారీ మెజారిటీ సాధించిన సందర్భంగా, ఈ విజయంలో సోమాజిగూడ డివిజన్‌ లో ఇంచార్జీగా అత్యధిక లీడ్‌ అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును సచివాలయంలో కలిసి మహేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ చారిత్రాత్మక విజయం స్పూర్తితో రాబోయే రోజుల్లో లోకల్‌ బాడీ, జీ.హెచ్‌.ఎం.సీ. ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -