Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి రాజబాబు..

బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి రాజబాబు..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : అడవి రాజబాబు వ్యాఖ్యాతగా, రంగస్థలం నటునిగా, రేడియో ప్రయోక్తగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా విలువైన సేవలు అందించాడని, అడవి రాజబాబు స్వరం ఎంత మాధుర్యమైనదో రేడియో ప్రజలకు చేరువ కావడానికి ఆయన శ్రమ అంతే దోహద పడిందని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. ఆదివారం నాడు హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఆకాశవాణి వ్యాఖ్యాత అడవి రాజబాబు పదవీ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు.  1991 నుంచి 95 వరకు నిజామాబాద్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వంటి యువతకు, ఔత్సాహిక రచయితలకు, కళాకారులకు అవకాశం కల్పించడంలో ముందున్నారని  ఆయన అన్నారు. ఆదివారం నాడు హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఆకాశవాణి వ్యాఖ్యాత అడవి రాజబాబు పదవీ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి గోపాల్, బట్టు దయానంద్, శంకర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img