మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 94 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ గెలుపు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజల సానుకూలతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని స్పష్టమైందన్నారు. గురువారం సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం, సంక్షేమంపై ఏఐసీసీ సమీక్షిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని తెలిపారు. తమ పార్టీ 87.5 శాతం టికెట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకిచ్చిందనీ, 67 శాతం వార్డు మెంబర్లుగా బీసీలు గెలిచారని గుర్తుచేశారు. సర్వేల ఆధారంగా కౌన్సిలర్ల ఎంపిక, మున్సిపల్ చైర్మెన్ల ఎంపిక జరిగిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదని చెప్పారు. నిజామాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థులపై కాంగ్రెస్ 5 సీట్లలో గెలిచిందనీ, అక్కడ మేయర్ దక్కించుకుంటే అభివృద్ధి జరుగుతుందని కార్పొరేటర్లు పొత్తు దిశగా ఆలోచించారని తెలిపారు.
గెలుపు ప్రజల సానుకూలతకు నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



