Friday, May 23, 2025
Homeతెలంగాణ రౌండప్మానాల గ్రామం ఉద్యమ కాలం నుండి నాతో వెంట నడిచింది

మానాల గ్రామం ఉద్యమ కాలం నుండి నాతో వెంట నడిచింది

- Advertisement -

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కేసీఆర్ సహకారంతో మానాల గ్రామానికి అనేక అభివృద్ధి పనులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ఉద్యమ కాలం నుండి మానాల గ్రామం తనతో వెన్నంటి నడిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సహకారంతో మానాల గ్రామం తో పాటు తండా పంచాయతీల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాల దేగావత్ తండా లో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ మాత ,శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన, పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బిఆర్ఎస్ నాయకులు, గిరిజన సోదరులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానాల గ్రామం ఉద్యమ కాలం నుండి నాతో వెంట నడిచిందని పేర్కొంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన ఈ గ్రామానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా కేసీఆర్ సహకారంతో మానాల గ్రామానికి అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు.ఇకముందు కూడా ఏ అవసరం వచ్చిన చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.ఈ ప్రభుత్వం సహకరించకుంటే మన ప్రభుత్వం వచ్చాక మీ మనసులో ఉన్న కావాల్సిన పనులు అన్ని పూర్తి చేయడానికి ముందు ఉంటానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గిరిజనులకు హామీని ఇచ్చారు.సంత్ సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా దీవెనలు ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర ప్రజలపై ముఖ్యంగా నా గిరిజన బిడ్డలపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతకు ముందు మానాల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గిరిజనులు, గిరిజన మహిళలు గిరిజన సంప్రదాయ రీతిలో మంగళ హారతులతో స్వాగతం పలికారు. పూలమాలవేసి, శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, దేగావత్ తండా గిరిజన పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -