మండల పంచాయతీ అధికారి భీమేష్
నవతెలంగాణ – కుభీర్
గ్రామాలను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం పంచాయతీ అధికారి భీమేష్ మండలంలోని విరేగాం,దావుజు నాయక్ గ్రామపంచాయతీలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నర్సరీలు, షగ్రిగేషన్ షెడ్, స్మశాన వాటికలను సందర్శించగా నర్సరీలో మొక్కలు నాటి వాటికి ప్రతిరోజు నీళ్లు పట్టించేలా చూడాలన్నారు. నర్సరీలో వివిధ రకాల పండ్లు పూల మొక్కలు నటించేలా చూడాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్కడినుండి గ్రామపంచాయతీ కార్యాలయన్ని సందర్శించి అధికారులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాథోడ్ సురేష్, జాదవ్ ప్రమీల పంచాయతీ కార్యదర్శులు సూర్య, కిరణ్ లు ఉన్నారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



