Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా 

ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా 

- Advertisement -

సర్పంచ్ మాధవి మల్లేష్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ప్రజల సహకారంతో రాణిపేట గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని సర్పంచ్ మాధవి మల్లేష్ అన్నారు. మంగళవారం మండలంలోని రాణి పేట గ్రామంలో  ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని రాజకీయాల అతీతంగా గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తానని చెప్పారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో రాణి పేటను గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కష్టపడి పని చేస్తానని అన్నారు. ఏ వార్డులో సమస్యలున్న వార్డు మెంబర్ల దృష్టికి ప్రజలు తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గ్రామంలో ఎన్ని సమస్యలున్న విడుదలవారీగా పరిష్కరించడమే లక్ష్యంగా కష్టపడి గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, ఉప సర్పంచి ,వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -