నవతెలంగాణ- కమ్మర్ పల్లి
ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని పలు పార్టీల నాయకులు అధికారులను కోరారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని పార్టీల నాయకులతో ముసాయిదా ఓటరు జాబితాలపై సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల వార్డుల వారిగా డ్రాఫ్ట్ ఫోటో ఎలక్ట్రోల్ జాబితా, గ్రామపంచాయతీ వార్డు వారిగా గుడ్ ఆఫ్టర్ 138 పోలింగ్ కేంద్రాల జాబితాలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ జాబితాపై ఆయా పార్టీల నాయకుల లిఖిత అభ్యంతరాలను, సలహాలను ఎంపీడీవో స్వీకరించారు.
ఓటరు జాబితాలో ఎలాంటి తొలగింపులు లేకుండా, తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని ఆయా పట్టిన నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఒక వార్డులోని ఓటర్లు మరో వార్డులోకి వెళ్లకుండా, ఒక పోలింగ్ విత్ సంబంధించిన ఓట్లన్నీ ఒకే కూలింగ్ కేంద్రాల్లో ఉండేలాగా చూడాలని కోరారు. పార్టీల నాయకుల అభ్యంతరాలను, సలహాలను ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఎంపీడీవో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.