నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1లో వేస్తున్న బ్లాస్టింగ్ దెబ్బలతో డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,ఇంటి గోడలు నేలమట్టమవుతున్నాయి. ఓసీపీకి 500 మిట్లర్ల దూరంలో ఉన్న ఇండ్లు,భూములు సేకరిస్తామని జెన్కో అధికారులు నిర్వాసితులకు ఇచ్చిన మాటలు నీటి మూటలైయ్యాయి.దీంతో బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఓసిపిలో పేలుస్తున్న బాంబుల దెబ్బలతో నిర్వాసితులు భయాందోళనకు గురవుతున్నారు.ఆదివారం ఓసిపిలో వేసిన బ్లాస్టింగ్ బాంబుల దెబ్బలతో ఎస్సికాలనికి చెందిన మారపల్లి రజితకు చెందిన ఇంటిగోడలు నేలమట్టం కావడం,ఇందుకు తోడుగా వర్షం కురియడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు,బట్టలు తదితర వస్తువులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.ఇందుకు జెన్కో కంపెనీ పూర్తి బాధ్యత వహించేలా చర్యలు తీసుకొని ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
బ్లాస్టింగ్ దెబ్బలతో కూలిన ఇంటి గోడలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES