ఓవైపు అమెరికాకు కీలక ఆయుధాలు కరవు.. మరోవైపు బెదిరింపులు
వేధిస్తున్న జేఎంఎస్‌ఎస్‌ఎం-ఈఆర్ క్షిపణుల కొరత
వాషింగ్టన్ : ఇరాన్‌తో యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్థావరాల్లో మోహరించిన ఓ ఆయుధాన్ని పశ్చిమాసియా వైపు తరలిస్తోంది. అమెరికా అమ్ములపొదిలో ఉన్న ఈ క్షిపణి నిల్వల్లో మూడొంతులకుపైగా ఇరాన్‌పై గురిపెట్టింది. ఆ ఆయుధం పేరు జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైల్-ఎక్స్‌టెండెడ్ రేంజి (జేఎంఎస్‌ఎస్‌ఎం-ఈఆర్). ఇదొక క్రూజ్ క్షిపణి. దీన్ని అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లో మోహరించింది. ఇరాన్‌పై యుద్ధం తీవ్రం కావడంతో మార్చి చివర్లో ఈ క్షిపణులను పశ్చిమాసియాలోని సెంట్రల్ కమాండ్‌కు, యూకేలోని ఫెయిర్‌ఫోర్డ్ బేస్‌కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఒక్కో క్షిపణి విలువ 1.5 మిలియన్ డాలర్లు
ఒక్కో జేఎంఎస్‌ఎస్‌ఎం- ఈఆర్ విలువ 1.5 మిలియన్ డాలర్లు. దీని రేంజి 600 మైళ్లు. వీటిని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తోంది. శత్రుదేశాల మధ్యలో ఉండే హైవాల్యూ టార్గెట్లపై ప్రయోగించేందుకు దీన్ని డిజైన్ చేశారు. ఇందుకోసం అమెరికా విమానాలు శత్రుదేశ గగనతలంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఈ క్షిపణిని గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించలేవు. వీటిని అమెరికా వద్ద ఉన్న స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు బీ-1బీ లాన్సర్, బీ-52 స్ట్రాటోఫోర్ట్రస్‌లు, కొన్ని రకాల ఫైటర్ జెట్‌లు మాత్రమే ప్రయోగించగలవు. ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద 2,300 జేఎంఎస్‌ఎస్‌ఎం- ఈఆర్ క్షిపణులున్నాయి.
వీటిని యుద్ధంలో విరివిగా వినియోగించడంతో నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 425 మాత్రమే ఉన్నట్టు అంచనా. 2009లో 6,200 క్షిపణుల వేరియంట్ల కొనుగోలుకు అమెరికా నిధులు కేటాయించింది. ఆ తర్వాత నిధుల కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో బేస్ మోడల్ క్షిపణుల తయారీ పదేండ్ల క్రితమే నిలిచిపోయింది. మరోవైపు యుద్ధం ప్రారంభ వారాల్లోనే 1,000 జేఎంఎస్‌ఎస్‌ఎం- ఈఆర్ లను అమెరికా ఉపయోగించింది. ఈ నేపథ్యంలో వీటిని మళ్లీ భర్తీ చేయాలంటే కొన్నేండ్లు పడుతుంది. ఈ ఏడాది లాక్‌హీడ్ మార్టిన్ 400 క్షిపణులను మాత్రమే ఉత్పతి చేస్తుందన్న అంచనాలున్నాయి. దీన్ని 860 వరకు పెంచే అవకాశం ఉంది. అలా చూసినా.. 1,000 క్షిపణుల ఉత్పత్తి మాత్రం సాధ్యం కాదు.
యుద్ధంతో ట్రంప్‌నకు తలనొప్పి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



