Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం538 అడుగులకు తగ్గిన 'సాగర్‌' నీటిమట్టం

538 అడుగులకు తగ్గిన ‘సాగర్‌’ నీటిమట్టం

- Advertisement -

– ఏప్రిల్‌ 7 వరకు సాగునీటి విడుదల
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌

నాగార్జునసాగర్‌ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను శుక్రవారం నాటికి 538 అడుగులకు తగ్గింది. సాగర్‌ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా నిర్విరామంగా నీటి విడుదల జరుగుతూ ఉండటంతో దానికి తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి రాక పూర్తిస్థాయిలో లేనందున సాగర్‌ జలాశయ నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుంచి 19,565 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్‌ జలాశయం నుంచి 24,345 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దీనిలో కుడికాలువ ద్వారా 8831 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8417 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2000 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 4503 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా జలాశయంలోకి 4870 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గతేడాది ఇదేరోజున నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం 590 అడుగులకుగాను 526 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయంలో 185.62 టీఎంసీల నీరు నిల్వ ఉండగా వీటిలో 54 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశముంది. రబీ పంటకు గాను ఎడమ కాలువ పరిధిలో ఏప్రిల్‌ 7వ తేదీ వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -