Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్చు తగ్గుల మధ్యలో కౌలస్ నాళా ప్రాజెక్ట్ నీటిమట్టం

హెచ్చు తగ్గుల మధ్యలో కౌలస్ నాళా ప్రాజెక్ట్ నీటిమట్టం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : చూతగుల మధ్యలో కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం కొనసాగుతుంది. గత రెండు రోజులుగా క్రితం నుండి అడపాదడపా భారీ వర్షాలు ప్రాజెక్టు ఎగువకు ఉన్న ప్రాంతాలలో  పడుతుండడంతో నీరు వచ్చి చేరిపోయింది. అధికారులు అప్రమత్తమై నీటి పరివాహక ప్రాంతా గ్రామాల ప్రజలకు, రైతులకు పశువుల కాపరులకు హెచ్చరికలు జారీ చసి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఆరు గంటల నాటికి ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలో 458 మీటర్లకు గాను 458 మీటర్లు నీరు నిల్వ ఉంది అని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ ఒకటి పాయింట్ 237  టిఎంసి ఉందని అన్నారు. ఇన్ఫ్లో ఎగువ నుండి ఒక వంద 44 క్యూసెక్కులు నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రాజెక్టు అధికారులు ఒక గేటును ఓపెన్ చేసి దిగువకు 144 క్యూసెక్కులు నీటిని ఒక వరద గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతము ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నీటి నిలువ ఒక స్థాయిలో కొనసాగుతూ వస్తుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -