బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అంగడి ప్రారంభం
సంత ఏర్పాటు చేయడం పట్ల హర్ష వ్యక్తం
సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్
నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో వారాంతపు అంగడి గ్రామస్తులకు ఎంతో మేలు జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, ఎస్సై చిర్ర రమేష్ బాబు అన్నారు. ఆదివారం అంగడిని గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ప్రతి ఆదివారం అంగడి నిర్వహించడం వల్ల గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరిగి లాభం చేకూరుతుందని అన్నారు. గ్రామంలో ప్రజలకు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు.
గ్రామస్తులు దూర ప్రాంతాలకు వెళ్లి కూరగాయలు వివిధ రకాల సరుకులను కొనుగోలు చేసేందుకు వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడే వారని తెలిపారు. ఇప్పుడు వారి ఇబ్బంది పడవ దాని ఉద్దేశంతో ఈ సంత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అధిక ఖర్చు కూడా అయ్యేదని అన్నారు. ఇప్పుడు అలాంటి బాధ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకులను కొనుగోలు చేసేందుకు ఈ గ్రామంలో ప్రారంభించామని అన్నారు. ఈ సంతాలో అన్ని రకాల సరుకులు దొరుకుతాయని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ గ్రామంలో ఈ సంతా ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహేశ్వరి, స్వరూప, పరశురాములు, అనంతలక్ష్మి, మునేష్, సరిత, మురళి, ఎల్లమ్మ, ఎన్జీఎఫ్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.



