నవతెలంగాణ – జన్నారం: మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకెపి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే గోదాములకు తరలించాలని, మండల సామాజిక ఉద్యమకారుడు శ్రీరాముల, భూమా చారి అన్నారు. సోమవారం ప్రధాన రహదారి మండల తాసిల్ చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం 5 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అయినా సరే ఆ నష్టాన్ని రైతులు ఓర్చుకున్నప్పటికీ, తూకంలో జాప్యం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీల ద్వారా గోదాములకు తరలిస్తే, అకాల వర్షాలకు రైతులు, ధాన్యం తడవకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా ఉంటుందన్నారు. ఆలస్యం చేయడం వల్ల అకాల వర్షాలకు రైతుల ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించి వెంట వెంటనే తూకం వేస్తూ వెంటవెంటనే తూకం వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. లేకుంటే రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
తూకం వేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES