దిలవూర్ పూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని దామరచర్ల మండలం దిలావర్ పూర్ గ్రామ పంచాయతీలోని మిట్టగూడెం నందు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి దారులు క్రైస్తవ సోదరి ఎలిజాల సైదమ్మ నూతన ఇళ్లును గురువారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏసుక్రీస్తు శిలువను బహుమతిగా ఇచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకరక్షకుడు ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ఒక పేదకుటుంబం సొంత ఇంటి కల నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలనలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమాన్ని అందిస్తూ ప్రజల ఆశీర్వాదాలు అందుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో దిలావర్ పూర్ సర్పంచ్ బెజ్జం సాయి, అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా పాలనలో పేదల సంక్షేమమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



