Thursday, March 12, 2026
E-PAPER
Homeజిల్లాలుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

- Advertisement -

– ప్రభుత్వ  విప్ బీర్లు అయిలయ్య 
నవతెలంగాణ-ఆలేరు టౌన్ :  పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే , బిర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల  అభీష్టం  మేరకు, వారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచానని, వారికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పారు. 

1908 జీవో ప్రకారం   , ఎండోమెంట్ సీలింగ్ ఇతర ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అన్నారు. పేదలకు చెందిన  ఇండ్లు, ఇండ్ల స్థలాల జోలికి ప్రభుత్వం రాబోదని చెప్పారు. ఆలేరు , యాదగిరిగుట్ట పట్టణాలలో ప్రజలకు చెందిన  ఇండ్లు ,ఇళ్ల స్థలాలు ,ఆస్తులు ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి కూల్ చేస్తుందనే ప్రచారం నమోవొద్దని పేర్కొన్నారు.
 ప్రతి కుటుంబానికి అండగా, భరోసాగా నేనుంటానని చెప్పారు.
ఆలేరు పట్టణంలో ఇప్పటివరకు 250 ఇండ్లు మంజూరు చేశామని, మరో రెండు వందల యాభై ఏండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.  ప్రజా ప్రభుత్వం పేదోడి పక్షాన నడుస్తుందని చెప్పారు. బిఆర్ఎస్ , బిజెపి చీకటి ఒప్పందాలతో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఆపత్కాలంలో ఆడపిల్ల పెళ్లికి ఆస్తి అమ్ముకునే హక్కు ఉందని, ఈ అంశంపై రానున్న శాసనసభ సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.  ఆలేరు పట్టణంలోని సిల్క్ నగర్ , బీసీ కాలనీ, మార్కండేయ నగర్ , బీరప్ప గడ్డ   ఇతర చోట్ల ఉన్న జీవో కిందికి వచ్చిన ఇళ్లకు తను గ్యారంటీ అని పేర్కొన్నారు. అపోహలు నమ్మవద్దన్నారు. 
అనంతరం మాజీ ఎంపిటిసి ఏండి  జైనోద్దీన్ జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  చాలువతో ఘనంగా సన్మానించారు.  ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, చీర శ్రీశైలం,కె వెంకటేశ్వరరాజు , బీజన భాస్కర్, ముదిగొండ శ్రీకాంత్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎండి సలీం, టి మహేష్, జె సిద్ధులు,    నవీన్ , సురేష్  , విక్రమ్, రాజశేఖర్, ఎండి బాబా,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -