సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ద్వేయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే సీఎంఆర్ఎఫ చెక్కులు వరంగా మారాయని తెలిపారు. మండలంలోని 36 మంది లబ్ధిదారులకు 11 లక్షల 93000 చెక్కులను అందజేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పేదలకు సీఎంఆర్ చెక్కులను అందజేయడంలో పాలకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలో ముందున్నదని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ సహాయం పేదల కుటుంబాల్లో ఊరటను కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, నాయకులు వీరమనేని యాకాంతరావు, ఎండి మదర్, బొమ్మగాని మానస భాస్కర్ గౌడ్, నునావత్ హరిలాల్ నాయక్, బండిపెళ్లి మనమ్మ, మాదాసు హరీష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.