నవతెలంగాణ – ధర్మసాగర్
నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్త శుద్ధితో పని చేస్తున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మసాగర్, వేలేరు, కాజీపేట మండలాలకు సంబందించిన 18మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 18లక్షల 02వేల 088రూపాయల విలువగల చెక్కులను, ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబదించిన 32మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 12లక్షల 75వేల 500రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజా పాలనలోనే నిరుపేద వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన పేదలకు అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. మీ అందరి సహకారంతో రానున్న రోజులలో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సదానందం, ఎంపీడివోలు అనిల్ కుమార్, డిప్యూటీ తాసిల్దార్, ఆ ఐ లు,స్థానిక ప్రజా ప్రతినిధులు పిట్టల సత్యనారాయణ,ఎర్రబెల్లి శరత్, పెసరు రమేష్, మునిగాల యాకోబు, చాడ నరసింహారెడ్డి, రొంది రాజు యాదవ్,నాయకులు గుర్రపు ప్రసాద్, యాకూబ్ పాషా, యామిని, కార్యకర్తలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.