Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వడ్డెరల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం 

వడ్డెరల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం 

- Advertisement -

బ్రిటిష్ పాలనను ఎంతమందించడంలో ఓబన్న పోరాటం ఆదర్శం 
ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

వడ్డెరల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. వడ్డెరల జాతిపిత వడ్డెర ఓబన్న విగ్రహాన్ని బుధవారం మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆర్చి గేటు సమీపంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్డెర ఓబన్న విగ్రహాన్ని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు మొగిలితో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్ఎస్స రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనను అంతమొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏర్పాటుచేసిన పదివేల సైన్యంలో ఓబన్నను సైన్యాధిపతిగా నియమించారని తెలిపారు.

బ్రిటిష్ సైన్యంపై యుద్ధం ప్రారంభించిన ఓబన్నను 1948లో ఉరితీసారని అన్నారు. ఓబన్న పోరాట స్ఫూర్తి వడ్డెర సామాజిక వర్గంలో చైతన్యాన్ని నింపిందని గుర్తు చేశారు. వడ్డెర ఓబన్నను గత పాలకులు విస్మరించారని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఓబన్న పోరాట పటిమను గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తుందని తెలిపారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపు మురళి మాట్లాడుతూ వడ్డెర ఓబన్న చరిత్రను వెలికి తీయడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఓబన్న పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచి భావితరాలకు అందించాలన్నారు.

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సహకారంతో పాలకుర్తిలో ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వడ్డెర సమాజానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అనంతరం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పల్లపు శ్రీనివాస్, మండల అధ్యక్షులు బొమ్మిశెట్టి సోమనర్సయ్య, మండల గౌరవ అధ్యక్షులు బొమ్మిశెట్టి ఎల్లేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు శివరాత్రి కొమరయ్య, మండల ఉపాధ్యక్షులు వల్లపు యాదగిరి, హరిజన కాలనీ మాజీ ఉపసర్పంచ్ వల్లెపు రవి, నాయకులు బొమ్మిశెట్టి కుమార్, మహిళా నాయకులు ముద్దంగుల భాగ్యలక్ష్మి లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad