Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్హర్ లో హస్తం హవా.!

మల్హర్ లో హస్తం హవా.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మూడో విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో బుధవారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తందే హవా కొనసాగింది. మొత్తం 15 సర్పంచ్ లకు గాను 12 కాంగ్రెస్,రేండు బిఆర్ఎస్,ఒకటి స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1తాడిచెర్లలో బండిస్వామి(కాంగ్రెస్),2, మల్లారంలో మేకల రాజయ్య(కాంగ్రెస్), 3 పెద్దతూoడ్లలో బండారి నర్సింగరావు(కాంగ్రెస్),4, వళ్లెంకుంటలో బొమ్మ రజిత-రమేష్ రెడ్డి(కాంగ్రెస్),5, కొండంపేటలో బెల్లంకొండ జ్యోష్ణ-సరిన్ రావు (కాంగ్రెస్)6,కొయ్యుర్ లో కొండ రాజమ్మ (కాంగ్రెస్) 7,ఎడ్లపల్లిలో జంగిడి శ్రీనివాస్ (కాంగ్రెస్) 8,రుద్రారంలో చంద్రగిరి అశోక్ (కాంగ్రెస్)’ 9 నాచారంలో ఒర్రె వనమ్మ-రాజైలు,10,ఆన్ సాన్ పల్లిలో గుగులోతు మంజుల-జగన్ నాయక్,11 అడ్వాలపల్లిలో అజ్మీరా సారక్క (బిఆర్ఎస్), 12, దుబ్బపేటలో రవిందర్ నాయక్ (బిఆర్ఎస్), 13, ఇప్పలపల్లిలో అబ్బినేని లింగస్వామి (స్వతంత్ర).14, చిన్నతూoడ్లలో గడ్డం క్రాoతి (కాంగ్రెస్)’15, మల్లంపల్లిలో జాడి రాములు (కాంగ్రెస్) విజయం సాధించారు.మండల వ్యాప్తంగా 2,1547 ఓట్లు ఉండగా ఇందులో పోలైన ఓట్లు 18,057. అందులో పురుషులు 8,967, స్త్రీలు 9,090, 83.98శాతం ఓటు శాతం నమోదైంది.మండల వ్యాప్తంగా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -