Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాల ఉపసంహరణ అన్యాయం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాల ఉపసంహరణ అన్యాయం

- Advertisement -

ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాల ఉపసంహరణ అన్యాయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు కళాశాలలకు ప్రాక్టికల్‌ కేంద్రాలివ్వడం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలపై వివక్ష చూపించడమేనని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయంతో హాస్టళ్లలో నివసించే విద్యార్థులు ఇతర కళాశాలలకు 15 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అభినందనలు తెలిపారు. విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రతిభ జాతీయ గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌ తరాలకు ప్రేరణగా పద్మశ్రీలు నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీల ధర్నాకు తపస్‌ మద్దతు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవియన్‌ రెడ్డి, మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక పరమైన పెండింగ్‌ బిల్స్‌, బెనిఫిట్స్‌, పీఆర్సీ, డీఏల ప్రకటన కోసం ఈ నెల 27న నిర్వహించనున్న నిరవధిక 24 గంటల ధర్నాకు తపస్‌ మద్దతు తెలిపింది. ఈ మేరకు తపస్‌ రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -