రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత మేకర్స్ బుధవారం ‘అద్దం ముందు’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
భీమ్స్ సిసిరోలియో ఓ మధురమైన మెలోడియస్ ట్రాక్‌ను అందించారు. మనసును హత్తుకునే బీట్‌లు, శ్రేయా ఘోషాల్ ఆకట్టుకునే వాయిస్ కలగలిపి పాటను మరింత మ్యాజికల్ మార్చాయి.
కపిల్ కపిలన్ వాయిస్ మాధుర్యాన్ని పెంచింది. ప్రేమలో ఉన్న జంటల మనసులోని మాటలను చంద్రబోస్ అద్భుతంగా రాశారు. ఒకరి కోసం ఒకరు మాత్రమే ఉన్నట్టుగా వారి ప్రేమలో ప్రతి క్షణాన్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా చిత్రించే పాట ఇది. ఈ సాంగ్ భార్యాభర్తలు తమ ప్రేమను వ్యక్తం చేసుకునే అద్భుతమైన మెలోడీ సాంగ్‌గా అలరిస్తోంది. ఈ సాంగ్‌లో విజువల్స్.. విజువల్ ఫీస్ట్‌లా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో, యూరప్ అందమైన లొకేషన్ల మధ్య తెరకెక్కిన ఈ పాటలో రవితేజ, డింపుల్ హయాతి కెమిస్ట్రీ అదిరిపోయింది. వారి రొమాంటిక్ మోమెంట్స్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ప్లేఫుల్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కలిసి పాట కన్నుల పండగలా ఉంది.
మెలోడియస్ వోకల్స్, అద్భుతమైన సాహిత్యం, మనసు దోచే విజువల్స్.. ఈ మూడు కలిసి ఈ సాంగ్ మనసుని హత్తుకునే ట్రాక్‌గా నిలబెట్టాయి. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నాయకానాయికలుగా నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, డీఓపీ : ప్రసాద్ మురెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరు కుమార్ చాగంటి.
అద్భుతమైన మెలోడీ ‘అద్దం ముందు..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



