– కార్యాచరణపై ఎంపీడీవో లతో కలెక్టర్ వీసీ
– ఎంపీడీవో అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులను ఈ నెల 22 న పనుల జాతర పేరుతో ప్రారంభించనున్నారు. ఈ పనులు కార్యాచరణ కోసం బుధవారం ఎంపీడీఓ లతో కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించి లక్ష్యం సాధనకోసం పలు సూచనలు,సలహాలు చేసారు. ఈ క్రమంలో స్థానిక ఎంపీడీఓ బి.అప్పారావు నవతెలంగాణ తో మాట్లాడారు.
పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం,స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణం),పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ల ద్వారా, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ద్వారా చేపట్టబోయే కొత్త పనులను ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పనులను ప్రారంభించడానికి “పనులు జాతర – 2025” పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది అని తెలిపారు.ఈ నేపద్యంలో ఈ నెల 22 న కొత్త పనులను ప్రారంభించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదించాలని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ‘ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా” లో పశువుల పాకలు,షెడ్లు,కంపోస్ట్ గుంతలు, కోళ్ళ ఫారాలు, “పొలం బాటలు” లో నర్సరీల పెంపకం, “జల నిధి” లో చెక్ డ్యాం లు, పారం పాండ్ లు,ఊట కుంటలు,గ్రామీణ మౌళిక వసతులు లో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు,అంగన్వాడీ భవనాలు మొదలగు పనులు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ద్వారా ప్లాస్టిక్ వెస్ట్ యూనిట్,సిగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, అంగన్వాడి టాయిలెట్లు,పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం (సీఆర్ఆర్/ఎంఆర్ ఆర్) విధులలో పనులు ప్రారంభించడానికి ప్రతిపాదించారు అని తెలిపారు.
ఈ ప్రతిపాదించిన పనులను మండల వ్యాప్తంగా చేపడతామని అన్నారు. ఈ పనులు ప్రతి గ్రామంలో ప్రారంభించి మార్చ్ 2026 చివరి నాటికి పూర్తి చేయడు లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు. ఈ “పనుల జాతర – 2025” కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు,సిబ్బంది,ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.