వర్కర్ టు ఓనర్ షెడ్లను ఇతర కంపెనీలకు కేటాయిస్తే కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతాం
పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
వర్కర్ టు ఓనర్ పథకం పూర్తిచేసి పవర్ లూమ్ కార్మికులకు వెంటనే అందించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్ చేనేత భవన్ లో చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టర్ గారి సమక్షంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులతో వర్కర్ టు ఓనర్ పథకం గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ.. వర్కర్ టు ఓనర్ పథకానికి పవర్ కార్మికులకు అందించకుండా వర్కర్ టు ఓనర్ షెడ్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని, ఈ ఆలోచన మానుకొని ప్రభుత్వం కార్మికుల శాశ్వత ఉపాధి కొరకు ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ షెడ్లలో కార్మికులకు పవర్లూమ్ అందించాలని ఒకవేళ ప్రభుత్వం ఇతర కంపెనీలకు కేటాయించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని అన్నారు.
వర్కర్ టు ఓనర్ పథకం కావాలంటే కార్మికులు ఎట్లా వస్త్రాలు తయారుచేస్తారు మార్కెట్ ఎలా చేస్తారు బ్యాంకు లోన్ ఎలా తీసుకువస్తారు పరిశ్రమను ఎలా నడిపిస్తారు అన్ని విషయాలను రూపకల్పన చేసి ప్రభుత్వానికి రెండు నెలల వరకు కార్మికులు అందించాలని కమిషనర్ తెలియపరచడం జరిగింది. సాధ్యం గాని నిబంధనలు కార్మికులకు విధించి కార్మికులను వర్కర్ టు ఓనర్ పథకం నుండి తప్పించి ఉపాధి కల్పిస్తామనే పేరుతో పెద్ద కంపెనీలకు కట్టిన షెడ్లను అప్పజెప్పాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ సరియైన పద్ధతి కాదు కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పన పేరుతో ఏర్పాటు చేసిన పథకాన్ని కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ , పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ పాల్గొన్నారు.
వర్కర్ టూ ఓనర్ పథకం పూర్తి చేసి పవర్లూమ్ కార్మికులకు అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



