Monday, September 15, 2025
E-PAPER
HomeNewsవర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలి

వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలి

- Advertisement -
  • – పవర్లూమ్ యూనిట్లకు అదనంగా విధించిన బ్యాక్ బిల్ కరెంటు చార్జీలను  వెంటనే రద్దు చేసి విద్యుత్ సబ్సిడీ బకాయిలను చెల్లించాలి
    – మహిళా పొదుపు సంఘాల చీరలకు 10% యారన్ సబ్సిడీ పథకాన్ని అమలు పరచాలి
    – టెక్స్టైల్ పార్కు లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి
    – చిన్న పవర్లూమ్ పరిశ్రమకు 1000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి

    – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్
  • నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
  • వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముషమ్ రమేష్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముశం రమేష్  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కేటీఆర్  తలుచుకుంటే చిటికెలో అయ్యే పనులు చేయకుండా పెండింగ్ పెట్టడం వలన ఆ సమస్యలు జటిలంగా మారాయని వర్కర్ టూ ఓనర్ పథకం ప్రారంభించి షెడ్ల నిర్మాణం పూర్తి చేసి పవర్లూమ్స్ వేయకుండా ఆపడం వల్ల కార్మికులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.కొత్తగా వచ్చిన ప్రభుత్వం  వర్కర్ టూ ఓనర్ కు కట్టిన షెడ్లు ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని పవర్లూమ్ పరిశ్రమకు అదనంగా విధిస్తున్న బ్యాక్ బిల్ సమస్య వల్ల పరిశ్రమలన్నీ సంవత్సరం కాలం పాటు బందుపడ్డాయని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం జరుగుతుందన్నారు.
  • వర్కర్ టూ ఓనర్ పథకాన్ని పూర్తిచేసి కార్మికులకు అందించాలని , బ్యాక్ బిల్ విద్యుత్ సమస్య పరిష్కరించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు.
  • ఆగస్టు 26న సిరిసిల్లకు మంత్రులు వస్తున్న సందర్భంగా వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని వర్కట్ టూ ఓనర్ పథకాన్ని పూర్తిచేసి కార్మికులకు అందించే విధంగా హామీ ఇవ్వాలని , విద్యుత్  బ్యాక్ బిల్ , సబ్సిడీ సమస్య పరిష్కరించాలని ,  ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు 10 శాతం యారన్ సబ్సిడీ పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులకు అందించాలని , టెక్స్టైల్ పార్కులో బందుపడ్డ పరిశ్రమలు తెరిపించాలని టెక్స్టైల్ పార్కు కు విద్యుత్ సబ్సిడీ అందించికార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కనీస వేతనాలు అమలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పవర్లూమ్ పరిశ్రమకు ఇస్తున్నట్టు 1000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు
  • ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ , ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -