నవతెలంగాణ – కంఠేశ్వర్ : కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీజీ యూఈ ఈ యు సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరేడ్డి చంద్రరేడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియి నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఈ ని ని కలిసి ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. విద్యుత్ సంస్థలొ పనిచెస్తూనా కార్మికుల సమస్యలపై నిజాంబాద్ సర్కిల్ ఎస్ ఈ ని కలిసి విద్యుత్ సంస్థలో పనిచేసినటువంటి కార్మికులపై పనిభారం తగ్గించాలని తెలిపారు. సబ్ స్టేషన్ లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. కార్మికులు లేక ఒకొ సబ్ స్టేషన్ లో ఇద్దరు డ్యూటీ చేసే పరిస్థితి ఉందని, ఇంకొకరిని డ్యూటీకి అడ్జస్ట్ చేయాలని సూచించారు. ప్రతి సబ్ స్టేషన్ లో ముగ్గురు డ్యూటీ చేసే విధంగా తాత్కాలికంగానైనా.. ఇతర ఉద్యోగులతోనైనా పని చేయించాలని కోరారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన పేయిడ్ హలిడేసు కూడా అధికారులు ఇవ్వడం లేదని, వాటిని వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియి నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఈ ని ని కలిసి చర్చించడం జరిగిందని అన్నారు. వారు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తారని హామీ ఇచ్నినట్లు తెలిపారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎన్.నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులపై పనిభారం తగ్గించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES