Wednesday, May 21, 2025
Homeఅంతర్జాతీయంభవిష్యత్తులో మహమ్మారుల నివారణకు ప్రపంచ దేశాలు కలిసి రావాలి

భవిష్యత్తులో మహమ్మారుల నివారణకు ప్రపంచ దేశాలు కలిసి రావాలి

- Advertisement -

– తీర్మానాన్ని ఆమోదించిన డబ్ల్యూహెచ్‌ఓ
జెనీవా:
భవిష్య త్తులో తలెత్తే మహ మ్మారుల నుంచి ప్రపంచ దేశాలను సురక్షితంగా వుంచేందుకు, అన్ని దేశాలకు అవసరమైన అత్యవసర వైద్యసదు పాయాలు సమా నంగా అందేలా చూసేం దుకు ప్రపంచంలోనే మొదటిసారిగా చారిత్రక మహమ్మారి నివారణా ఒప్పందాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించింది. ఈ ఒప్పందానికి అనుకూలంగా సభ్య దేశాలు ఓటు వేశాయి. కొవిడ్‌ మహమ్మారి సృష్టించిన తీవ్ర ప్రతికూల ప్రభావాలు, పర్యవసానాలు ఆ నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందించిన తీరు, చేపట్టిన చర్యలపై మూడేండ్లకి పైగా ఉధృతంగా చర్చలు జరిపిన అనంతరం 78వ ప్రపంచ హెల్త్‌ అసెంబ్లీ ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ సమయంలో ఆ మహమ్మారిని నివారించడానికి, ప్రతిస్పందించడానికి దేశాల మధ్య వున్న అంతరాలు, అసమానతలను పరిష్కరించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని డబ్ల్యూహెచ్‌ఓ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 కింద ఆమోదించింది. ప్రపంచ దేశాలు, డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు, పౌరసమాజం, ప్రయివేట్‌ రంగం, ఇతర భాగస్వామ్య పక్షాల మధ్య బలమైన సహకారం మరియు సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులను నివారించడం, ఒకవే సంక్షోభం సంభవించిన పక్షంలో మెరుగ్గా స్పందించడం లక్ష్యమని డబ్ల్యూహెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ నేపథ్యంలో భవిష్యత్తులో వచ్చే మహమ్మారుల నుండి ప్రపంచాన్ని రక్షించేందుకు కలిసిరావాలని నిర్ణయించుకున్న సభ్యదేశాలను డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -