Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బేడ బుడగ జంగం ఐక్యత కావాలి 

బేడ బుడగ జంగం ఐక్యత కావాలి 

- Advertisement -

జాతీయ అధ్యక్షులు నరసింహ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగునా ఉన్న బేడా బుడగ జంగాలకు అందడం లేదని  ఐక్యత ఉంటే సంక్షేమ పథకాలు అందుతాయని బేడ బుడగ జంగం జాతీయ అధ్యక్షులు కోడి గంటి నరసింహ, రాష్ట్ర అధ్యక్షులు కడమంచి సహదేవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో బుడగ జంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా ప్రభుత్వం  కృషి చేయాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు.

మిడ్జిల్ మండల గౌరవ అధ్యక్షులు దుద్దుకూరి రాములు, మండల అధ్యక్షుడిగా కళ్లెం స్వామి, కార్యదర్శిగా విభూది శివ ఉపాధ్యక్షులుగా కళ్లెం రామాంజనేయులు, కప్పెర బుచ్చయ్య, కోశాధికారిగా వానరాశి రాములుగా సహాయ కార్యదర్శిగా దూద్దుకూరి శ్రీనివాస్,సాంస్కృతిక కార్యదర్శిగా కప్పెర బాబులు, ప్రచార కార్యదర్శిగా కప్పెర జంగయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత అధ్యక్షులు కడమంచి చెన్నయ్య, సహాయ కార్యదర్శి బయల్పాటి బన్ని, సిరిగిరి రాజశేఖర్, సిరిగిరి శివ, దుద్దుకూరి రవి   యువకులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -