– ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్
– అమెరికా ఆధిపత్యానికి సవాలు
– ఎఫ్-35 రాడార్‌ను సెకన్లలోనే జామ్ చేయగల సామర్థ్యం
– చైనా శాస్త్రవేత్తల ఆవిష్కరణ
షాంఘై : ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో చైనా దూసుకుపోతున్నది. మిగతా దేశాలతో పోలిస్తే వినూత్న పరిశోధనలతో తన సత్తా చాటుతున్నది. ఇప్పటికే 6జీ టెక్నాలజీలో ఆ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నది. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఆ 6జీ టెక్నాలజీని ఉపయోగించే ఒక కొత్త ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌ను ఆవిష్కరించారు. ఇది అధునాతనమైనదనీ, ఆధునిక రాడార్ల కంటే చాలా శక్తివంతమైనదని వివరించారు. అమెరికా వైమానిక ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ చైనా ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇది అమెరికాకు చెందిన ఎఫ్-35 రాడార్ సిస్టమ్‌ను కేవలం సెకన్లలోనే నిలిపివేయగలదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (హెచ్‌యూఎస్‌టీ) ప్రొఫెసర్ డెంగ్ లీ నేతృత్వంలో దీనిని రూపొందించారు. రాడార్ న్యూట్రలైజేషన్‌లో ఇది చైనాకు ఆధిపత్యాన్ని తీసుకురానున్నదని విశ్లేషకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలో నేతొలి 6జీ పవర్డ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES