భారత జాతీయ జెండా
గిరిజన గురుకుల చిత్రకళ ఉపాధ్యాయుడి ప్రతిభ
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో గల గిరిజన గురుకుల బాలుర కళాశాల సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడెపు రజినీకాంత్ 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్ల ఎత్తు 2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న భారత జాతీయ జెండాను సుమారు గంట పాటు శ్రమించి తయారు చేశారు.
అదేవిధంగా చాక్ పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు 5m వెడల్పు ఉన్నటువంటి భారతీయ జాతీయ జెండాను సుమారు గంట పది నిమిషాల పాటు చెక్కి త్రివర్ణ రంగులు అద్దారు. చాక్ పీసులపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆంగ్ల అక్షరాలను 6 మిల్లీమీటర్ల ఎత్తు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో సుమారు 45 నిమిషాల పాటు స్తంభించి, గుండు పిన్ను సహాయంతో చెక్కి భారత ప్రజలకు తన సూక్ష్మకళ ద్వారా 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఇంతకుముందు చాక్ పీస్ పై భారత జాతీయ గీతం జనగణమన 278 అక్షరాలను, జాతీయ గేయం వందేమాతరం 284 ఆంగ్ల అక్షరాలను చాక్ పీస్, బియ్యపు గింజల పై రాశారు.
అదేవిధంగా 1.5 సెంటీమీటర్ ఎత్తు ఉన్న చాక్ పీస్ లపై 78 భారత జాతీయ జెండాలను తయారు చేశాడు. అదేవిధంగా ఒకే చాక్ పీసు పై రెండు మిల్లీమీటర్ల ఎత్తులో 78 త్రివర్ణ పథకాలను చెక్కారు. ఇతని ప్రతిభ చూసి గూగుల్, గూగుల్ వికీపీడియాలో రజనీకాంత్ పూర్తి సమాచారం పొందుపరిచారు. ఈ పెన్సిల్ గ్రాఫైట్ జాతీయ జెండాను ప్రపంచంలోని వివిధ బుక్ ఆఫ్ రికార్డులకు ప్రతిపాదనలు పంపినట్లు రజనీకాంత్ తెలిపారు.