- Advertisement -
పాతాళంలోని నీళ్లను చేది
దాహం తీర్చుకున్నట్టు
మహా గ్రంథాలను చదివి
గతిని నేర్చుకున్నట్టు
మట్టిని వడబోసి పసిడిని తీసినట్టు
మనుషులను వడగట్టి
మహత్యాన్ని వెలికి తీసి పట్టుకోవాలి.
లోక కళ్యాణార్థం నలుగురిలో దాన్ని వెలిగించి
దాని ఫలాలను నలుగురు తెంపుకొని తినేటట్లుగా చేయాలి
పరిశుద్ధమైన నేల మీద చెత్త వేసి పరిశుద్ధతను దాచినట్లు
మనిషి పవిత్రత ఎన్నో అబాండాలు, బద్నాములు,
మాటల ముళ్ళ కంపలు, కంటగింపుల దుప్పట్లు,
కాల్చివేసిన నిందల కింద నలుగుతున్నది
అన్నిటినీ జ్ఞానచీపురులతో ఊడ్చివేసి
మహత్తును లోకానికి అందియ్యాలి.
వాడిపోతున్న లోకపు చిగురులకు
సారవంతమైనదిగా పోసి సస్యశ్యామలం చేయాలి
ఏ మబ్బులు కమ్మని వికసిత జీవితం ఏర్పాటుకై.
– గుండెల్లి ఇస్తారి, 9849983874
- Advertisement -