జాత్యహంకారంతో భారతీయ యువతిపై లైంగికదాడి
రెండు నెలల వ్యవధిలో… రెండో ఘటన
లండన్: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఘోరం జరిగింది. జాత్యహంకార భావనతో భారత సంతతికి చెందిన 20 ఏండ్ల పంజాబీ యువతిపై ఓ శ్వేత జాతీయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఉత్తర ఇంగ్లాండ్‌లోని వాల్ సాల్ పట్టణంలో ఉన్న పార్క్ హాల్ ఏరియాలో ఈ ఘటన జరిగిందని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడి కదలికలతో కూడిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఇది జాత్యహంకార భావనతో జరిగిన నేరమని, నిందితుడిని చూడగానే తమకు సమాచారాన్ని అందించాలని పోలీసులు ప్రజలకు అత్యవసర సందేశాన్ని విడుదల చేశారు.కొన్ని వారాల క్రితమే పార్క్ హాల్ ఏరియాకు సమీపంలోని ఓల్డ్‌బరీ ఏరియాలో ఓ బ్రిటీష్ సిక్కు మహిళపై అఘాయిత్యం జరిగింది. అది కూడా జాత్యహంకార భావనతో జరిగిన దాడే అని పోలీసులు గుర్తించారు. ఈ రెండు లైంగికదాడి ఘటనలకు లింక్ ఉందా? లేదా ? అనేది ఇప్పుడే చెప్పలేమని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్ సూపరింటెండెంట్ రోనన్ టైరర్ స్పష్టం చేశారు. భారత సంతతి యువతిపై పాశవిక దాడి జరిగిందని, వీలైనంత త్వరగా నిందితుడిని అరెస్టు చేస్తామని అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన శ్వేత జాతీయుడికి 30 ఏండ్ల వయసు ఉంటుందని, తలపై చిన్నపాటి వెంట్రుకలతో, డార్క్ కలర్ దుస్తుల్లో నడుచుకుంటూ వెళ్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడని ఆయన తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ఉంటే ఇవ్వాలి : పోలీసులు
పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సంఘటనా స్థలం నుంచి సాక్ష్యాలను సేకరించామని, నిందితుడి ప్రొఫైల్‌ను రెడీ చేస్తున్నామని డిటెక్టివ్ సూపరింటెండెంట్ రోనన్ టైరర్ చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తామన్నారు. సంఘటన జరిగిన సమయంలో నిందితుడిని చూసిన ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల నుంచి కూడా ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు డిటెక్టివ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ దారుణం జరిగిన సమయంలో పార్క్ హాల్ ఏరియాలోని ఇళ్లలో ఉన్న సీసీటీవీల్లో, అటువైపుగా రాకపోకలు సాగించిన కార్ల కెమెరాల్లో నిక్షిప్తమై సమాచారం కూడా తమకు కావాలన్నారు. నిందితుడి కదలికలు ఆ కెమెరాల్లో రికార్డయి ఉంటే, తమకు ఫుటేజీని ఇవ్వాలని ప్రజలను రోనన్ టైరర్ కోరారు.
బాధిత వర్గం ఆందోళనను అర్థం చేసుకోగలం : పోలీసు చీఫ్ సూపరింటెండెంట్
‘ఈ ఘటన జరిగిన వాల్‌సాల్ ప్రాంతంలో విభిన్న జాతులు, వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ఈ దారుణ ఘటన వల్ల బాధిత వర్గం ఆందోళనకు గురవుతుందనే విషయం మాకు తెలుసు. బాధిత వర్గం ప్రజలతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. వారి ఆందోళనను, అభిప్రాయాలను మేం అర్థం చేసుకోగలం. రాబోయే రోజుల్లో వాల్‌సాల్ ప్రాంతంలో పోలీసు భద్రతను మరింత పెంచుతాం’ అని వాల్‌సాల్ పోలీసు విభాగం చీఫ్ సూపరింటెండెంట్ ఫిల్ డోల్బీ తెలిపారు.
తలుపు పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు
‘వాల్‌సాల్ పట్టణంలో ఆ యువతి ఇంటి తలుపును పగలగొట్టి మరీ నిందితుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ ఘటనను కలుపుకొని, గత రెండు నెలల వ్యవధిలో వాల్‌సాల్ పట్టణంలో రెండు లైంగికదాడి కేసులు నమోదయ్యాయి.
యూకేలో ఘోరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



