రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి తరుణ్ భాస్కర్ మరో యూనిక్ మూవీతో రాబోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాధినేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. శుక్రవారం చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా మూడ్, నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తోంది.
అమెరికన్ శైలిలో ఉన్న ఎరుపు-తెలుపు రంగుల బొమ్మలతో నిండిన ఈ డిజైన్‌లో, అమెరికా జెండాను గుర్తుచేసే నక్షత్రాలు, నిలువు గీతల నేపథ్యంలో దూసుకుపోతున్న విమానం కనిపిస్తుంది. పాస్‌పోర్ట్ స్టాంప్ ఒక సాహసోపేతమైన, సెటైరికల్ కథనాన్ని సూచిస్తుంది. రివాల్వర్, డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న క్యారికేచర్, నటరాజ కాంపస్ బాక్స్ ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!’అనే ట్యాగ్‌లైన్ మరింత హిలేరియస్‌గా ఉంది. టీజర్ ఈనెల 9న విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
‘గాయపడ్డ సింహం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



