Friday, January 2, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి డబ్ల్యూటీటీ పోరు

నేటి నుంచి డబ్ల్యూటీటీ పోరు

- Advertisement -

బరిలోకి యువ ప్లేయర్‌ స్నేహిత్‌

వడోదరా: డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ టోర్నీకి వేళయైంది. వడోదరా వేదికగా శుక్రవారం నుంచి మెగాటోర్నీ మొదలుకాబోతున్నది. డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌తో పాటు ఫీడర్‌ సిరీస్‌ జరుగనుంది. భారత్‌ టైటిల్‌ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతుండగా, 10 దేశాల నుంచి దాదాపు 334 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. యూత్‌ కంటెండర్‌ టోర్నీలో అండర్‌-11 నుంచి 19 వయసు విభాగాల్లో గేములు జరుగనున్నాయి. తొలుత అండర్‌-13, 17 వయసు విభాగాలతో టోర్నీ షురూ కానుంది. గతేడాది జరిగిన డబ్ల్యూటీటీ యూత్‌ కంటెండర్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌-19లో విజేతలుగా నిలిచిన అంకుర్‌ భట్టాచార్జి, సిండ్రెలా దాస్‌ ఈసారి సత్తాచాటాలని చూస్తున్నారు. వీరికి తోడు తెలంగాణ యువ ప్యాడ్లర్‌ ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌, మానుశ్‌ షా, దివ్య చితాలె, హర్మిత్‌దేశాయ్ టైటిల్‌ ఫెవరేట్లుగా భావిస్తున్నారు. స్వదేశంలో టోర్నీలు నిర్వహించడం ద్వారా మరింత మంది ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవకాశం లభిస్తుందని జాతీయ టీటీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కమలేశ్‌ మెహతా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -