Monday, November 10, 2025
E-PAPER
Homeఖమ్మంపశుసంపద సృష్టిలో యాదవులదే కీలక పాత్ర

పశుసంపద సృష్టిలో యాదవులదే కీలక పాత్ర

- Advertisement -

– యాదవుల సామాజికాభివృద్ధికి కృషి
– కాంగ్రెస్ నాయకులు జూపల్లి
నవతెలంగాణ – అశ్వారావుపేట

సమాజంలో పశుసంపద సృష్టిలో యాదవులదే కీలకపాత్ర అని, వారి వృత్తిపరం అయిన సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ హామీ ఇచ్చారు. కార్తీకమాసం సందర్భంగా యాదవ్ సంఘం అశ్వారావుపేట మండల విభాగం ఆధ్వర్యంలో సోమవారం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మండలంలో యాదవ్ లు నాకు వెన్నుదన్నుగా ఉండి నా రాజకీయ ప్రాస్థానంలో  కీలక పాత్ర  పోషిస్తున్నారని,వారికి ఏ సమస్య వచ్చినా  ఆ సమస్యను పరిష్కరించడంలో  ఎల్లప్పుడు ముందు ఉంటానని,ప్రతి యాదవ సంఘం  బాల బాలికలు  చదువులో ఆటల పోటీల్లో  విద్యలో ముందుండాలని ఆకాంక్షించారు.మండలం లో యాదవ్ భవనం కొరకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మంత్రులతో మాట్లాడి త్వరలోనే స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రముఖులు దొడ్డాకుల రాజేశ్వరరావు,ఆళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -