కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవ దర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’.
ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు.
ఈ నెల 26న ఈ మూవీ తెలుగులో రిలీజ్ కానుంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెషర్స్ మీట్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో సందడిగా జరిగింది. డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ,’ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. సింజిత్ సాంగ్ పాడాడు. ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరంతా థియేటర్స్‌లో చూడాలని కోరుతున్నా’ అని అన్నారు.
ప్రొడ్యూసర్లు వినీత్, సందీప్ మాట్లాడుతూ,’గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి మా మూవీ కంటెంట్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. డీవోపీ సూర్య ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఈ ప్రాజెక్ట్‌కు కనెక్ట్ అయ్యాక మేమంతా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్లాం. కెన్ ఈ మూవీని ఎంతో ప్యాషన్‌తో రూపొందించాడు. ఈ నెల 19న తమిళనాడు అంతా ఈ సినిమా చూసి సర్‌ప్రైజ్ అవుతుంది. ఈ నెల 26న తెలుగులో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు’ అని అన్నారు.
సర్‌ప్రైజ్ చేసే ‘యూత్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



