Thursday, January 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు

యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు

- Advertisement -

‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న‌శ్రీ వేణున్‌ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా ‘హలో ఇట్స్‌ మీ’. వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటిస్తున్నారు. షగ్న‌శ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శన్‌ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌2ఎస్‌ సినిమాస్‌, శ్సాస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై వీఎస్‌కే సంజీవ్‌, వంగపల్లి సందీప్‌, వంగపల్లి సంకీర్త్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌ సంజీవ్‌ మాట్లాడుతూ, ‘షగ కథ చెప్పిన విధానంలో ఆమె ప్యాషన్‌ కనిపించింది.

వరుణ్‌ సందేశ్‌ ఒక బ్రదర్‌లా మాతో ఉంటున్నారు. త్వరలోనే మంచి కంటెంట్‌తో మీ ముందుకు సినిమాని రిలీజ్‌కు తీసుకొస్తాం’ అని అన్నారు. ‘ఈ సినిమాకు మ్యూజిక్‌ ప్రాణం. వంశీ కాంత్‌ ఇచ్చిన ఆరు పాటలు చాలా బాగుంటాయి’ అని ప్రొడ్యూసర్‌ సందీప్‌ చెప్పారు. హీరోయిన్‌, డైరెక్టర్‌ షగ్న‌శ్రీ వేణున్‌ మాట్లాడుతూ,’ మంచి కథా కథనాలతో సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్‌ అవుతుంది. యూత్‌ అంతా మా చిత్రానికి కనెక్ట్‌ అవుతారు’ అని తెలిపారు. ‘వరుస థ్రిల్లర్స్‌ తరువాత నేను చేస్తున్న క్లీన్‌ ఫ్యామిలీ మూవీ ఇది. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న‌ బ్యూటీఫుల్‌గా ఈమూవీలో చూపించింది’ అని హీరో వరుణ్‌ సందేశ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -