Monday, May 19, 2025
Homeప్రధాన వార్తలుజూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌

జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబీటర్లు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేకపోవడంతో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్‌ రూపంలో చెల్లిస్తేనే సినిమాల ప్రదర్శన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, సురేష్‌బాబుతో పాటు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీలపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటుంటే, వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పాటైన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈమేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు. గతంలో పర్సంటేజ్‌ విధానాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. రూ.30 కోట్లకి పైబడి, రూ. 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు, రూ.10 కోట్లలోపు.. నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటివారం, రెండోవారం, మూడోవారం..అటు డిస్ట్రిబ్యూటర్‌కు, ఇటు ఎగ్జిబిటర్‌కు పర్సంటేజీల రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిని కూడా పున: సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -