Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైభవంగా థియేటర్‌ ఫెస్టివల్‌-2026

వైభవంగా థియేటర్‌ ఫెస్టివల్‌-2026

- Advertisement -

ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సురభి కళాక్షేత్రం, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ , తెలంగాణా చలనచిత్రం, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థల సంయుక్తాధ్వర్యంలో థియేటర్‌ ఫెస్టివల్‌- 2026 ఘనంగా జరిగింది. సురభి నాటకకళను భావి తరాలకు అందించాలనే సంకల్పంతో సురభి కుటుంబ సభ్యుడు, రంగస్థల కళలో పీహెచ్‌డీ పూర్తి చేసిన డాక్టర్‌ రమేష్‌ సింధే నేతృత్వంలో శేరిలింగంపల్లిలోని రంగ భూమి కల్చరల్‌ స్పేసెస్‌లో ఈ వేడుకలు జరిగాయి. నెల్లుట్ల రమాదేవి రచించిన మీడియా మేనియా (నాటిక), తనికెళ్ల భరణి రచించిన గోగ్రహణం (నాటిక)లను ఈ సురభి కళాక్షేత్రం వేదికపై ప్రదర్శించారు.

ఈ రెండు నాటికలకు డాక్టర్‌ రమేష్‌ సింథే దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ తాను రాసిన కథకు సరికొత్త హంగులు దిద్ది నాటకంగా వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అహోబిలం మిల్లెట్‌ కేఫ్‌ ఫౌండర్‌ శ్రీమతి హేమమాలిని మాట్లాడుతూ సురభి నాటక కళ ఎప్పటికీ కొనసాగాలనీ, భవిష్యత్‌ తరాలకు ఈ కళా వారసత్వాన్ని అందించాలని అభిలషించారు. ఆకాశవాణి ఏడీపీ శ్రీమతి నిహారా కానేటి మాట్లాడుతూ రెండు భిన్నమైన నాటకాలను ఒకే వేదికపై ప్రదర్శించడం గొప్పగా ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్‌ రమేశ్‌ సింధే మాట్లాడుతూ సురభి కళ, కళాకారుల్ని కాపాడుకోవడం సమాజ బాధ్యత అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -