Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాస్టర్ ఇంట్లో దొంగతనం.. మైనర్ బాలుడిపై కేసు

పాస్టర్ ఇంట్లో దొంగతనం.. మైనర్ బాలుడిపై కేసు

- Advertisement -

చోరీ చేసిన ఇంట్లోనే మూడు రోజులు మకాం
చర్చి దాబాపై అసాంఘీక చర్యలు
నవతెలంగాణ – పరకాల

మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకున్న దొంగతనం సంఘటన పరకాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఊర్లోని ఒక పాస్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసులో ఒక మైనర్ బాలుడిని నిందితుడిగా గుర్తించి, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మిపురం గ్రామానికి చెందిన పాస్టర్ ఇనుగాల ప్రమోద్ ఇంట్లో లేని సమయంలో కొందరు యువకులు, మైనర్ బాలుడితో సహా ఆయన ఇంట్లో రూ. 10 వేల నగదుతో పాటు, రూ.28 వేల విలువ గల ఓ సెల్ ఫోన్ ను దొంగిలించారు. అంతేకాకండా పాస్టర్ ఇంట్లోనే ఏకంగా మూడు రోజులు మకాం వేసి, అక్కడే వంట వండుకొని తిన్నట్లు తెలుస్తోంది. నిందితుడితో పాటు మరికొంతమంది యువకులు చోరీకి పాల్పడి, పాస్టర్ దుస్తులను ధరించడం, ఆ ఇంట్లోనే తిని, తాగి తందనానలు ఆడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ యువకులు చర్చి డాబాపై మల, మూత్ర విసర్జన వంటి అసభ్యకర చర్యలకు పాల్పడినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.

డ్రగ్స్ మత్తులో నేనా..
ఈ మొత్తం ఉదంతం వెనుక డ్రగ్స్‌కు అలవాటు పడిన కొంతమంది యువకుల ప్రమేయం ఉన్నట్టు గ్రామస్తులు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు, ఇతర వస్తువులు దొంగిలించడానికి, అలాగే చర్చి ప్రాంగణంలో ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడటానికి వారి వ్యసనమే కారణమై ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనలో మరికొంతమంది యువకుల ప్రమేయంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఈ సంఘటనకు సంబంధించి స్థానిక సీఐ క్రాంతి కుమార్ వివరణ కోరగా.. పాస్టర్ ఇనుగాల ప్రమోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా అదుపులోకి తీసుకున్న బాలుడు తనను మరికొందరు యువకులు ప్రోత్సహించినట్టు వెల్లడించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -