- Advertisement -
గ్రామాల్లో పనిచేయని నిఘా నేత్రాలు..
నవతెలంగాణ – కన్నాయిగూడెం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో పట్టపగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముప్పనపల్లి గ్రామానికి చెందిన బత్తిని ఎల్లస్వామి ఇంట్లో ఎల్ఐసీ బాండ్స్, బంగారు ఉంగురాలు పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన వస్తువుల విలువ సుమారుగా 1లక్ష రూపాయలు ఉంటాయని సమాచారం. పట్ట పగలు వ్యవసాయ పనులకి వెళ్లిన సమయంలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో నిఘా నేత్రాలు పనిచేయకపోవడం దోపిడీ దొంగలకు కలిసి వస్తున్నట్టు సమాచారం.
- Advertisement -



