Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమల కాలనీలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

తిరుమల కాలనీలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
పట్టణంలోని తిరుమల కాలనీలో  దొంగలు తాళం వేసిన ఇండ్లే టార్గెట్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మూడిళ్లలో తాళాలు పగల కొట్టి చోరీ జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పక్క ఇండ్లకు గొల్లలు పెట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు. రాకేష్ ఇంట్లో సుమారు లక్ష రూపాయల నగదు, ఐదు తులాల వెండి, బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడగా, దుగ్గిరెడ్డి రమేష్ ఇంటి గడియను ఆక్సాఫ్ బ్లడ్ తో కోసేసి ఇంట్లోని బీరువాను చిందర వందర చేశారు. మరో ఇంట్లో చోరీకి పడ్డట్లు సమాచారం. సిసి ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -