చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాత.
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినరు రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా దర్శకుడు వినరు రత్నం మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
ఇన్ఫీరియారిటీ కాంప్లక్స్, ఇన్‌సెక్యూరిటీస్‌తో ఫీలవుతూ వాళ్ల లైఫ్‌ను కాన్పిడెంట్‌గా లీడ్ చేయాలేకపోతున్నారు. పక్కవాళ్లకు ఉన్నవి చూసి మనకు అవి లేవు కదా అని కంపేర్ చేసుకుంటున్నారు. ఈ టైమ్‌లో చెప్పాల్సిన కథ అనిపించింది. అందుకే ఇలాంటి కథను సున్నితమైన భావోద్వేగాలతో చెప్పాలని అనుకున్నాను. అద్దంలో నిలబడి మనల్ని మనం చూసుకుని బాగు న్నామని ముందు మనం నమ్మాలి. ఒక మనిషిని నువ్వు ప్రేమించగలగాలి అంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించాలి అనేది ఈ కథ.
సినిమా చూసిన వాళ్లందరూ చాలా ఫ్రెష్ సినిమా చూశామని అన్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు’ సినిమాలతో కంపేర్ చేస్తున్నారు. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం కాదు. ప్యూర్ ఎమోషనల్ జర్నీ ఇది. కాకపోతే ఈ సినిమాలో ఎవ్వరిని ఇబ్బంది పెట్టని క్లీన్ కామెడీ ఉంటుంది.
మెల్లకన్ను ఉన్న వాళ్లను ఈస్ట్ గోదావరిలో చిదంబరం అని ఏడిపిస్తుంటారు. ఇందులో హీరోని చిదంబరం అని పిలిచి, పిలిచి అతన్ని సొంత పేరుని కూడా మరిచిపోయేలా చేస్తారు. సినిమాలో కథ విన్న తరువాత పాత్ర మీద రెస్పక్ట్ పెరిగి శ్రీ చిదంబరం అన్నాం. ఫైనల్ కాపీ చూసుకున్న తరువాత మరింత మర్యాద పెరిగి ‘శ్రీ చిదంబరం గారు’ అని పెట్టాం. ఈ సినిమాలోని హీరో పాత్ర కొందరి మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంది కదా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమా చూసిన ఎవరి మనోభావాలు దెబ్బతినవు. వాళ్ల మనోభావాలు సంతప్తి పొందుతాయి.
వాళ్ల మనోభావాలు సంతృప్తి చెందుతాయి
- Advertisement -
- Advertisement -



