Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిరుధాన్యాలు, కూరగాయల్లో అనేక పోషక విలువలు..

చిరుధాన్యాలు, కూరగాయల్లో అనేక పోషక విలువలు..

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల్లో అనేక పోషక విలువలు లభిస్తాయని, ప్రతినిత్యం వాటిని ఆహారంగా తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట అంగన్వాడీ సెంటర్ లో బలవర్ధకమైన ఆహారాన్ని తయారు చేసుకునే విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాల పట్ల బాలింతలు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ, అంగన్వాడీ టీచర్లు మమత, అనిత, కనకమ్మ, ఆశా అనిత, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -