‘లవ్ టుడే, డ్రాగన్’లతో రెండు వరుస హిట్‌లను అందించిన హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ‘డ్యూడ్’ ఈ సీజన్‌ను నవ్వులు, మ్యూజిక్, ఎమోషన్స్ తో అలరించనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్స్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు ఆడియన్స్ ఇంత పెద్ద స్థాయిలో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత ప్రేమని అందిస్తున్న ప్రేక్షకులందరికీ హదయపూర్వక కతజ్ఞతలు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి గారికి థ్యాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఇండియా. వాళ్ళతో పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇండియాలో నెంబర్ వన్ సంస్థగా ఉన్నారో అర్థమైంది. చాలా ప్యాషన్‌తో పని చేస్తారు. సినిమా ట్రైలర్‌కి తెలుగు, తమిళంలో అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్‌లో మీరు చాలా ఎంటర్టైన్మెంట్ చూసారు. సినిమాలో చాలా డ్రామా, ఎమోషన్ ఉంటుంది. మీరు ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి. అద్భుతమైన క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్‌కి థ్యాంక్యూ. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. యూత్‌తో పాటు ఫ్యామిలీస్ సినిమాని ఇష్టపడతారు. దీపావళికి సినిమా రిలీజ్ అవుతుంది’ అని తెలిపారు.
‘ఈ సినిమా ఒక మంచి వైబ్. ట్రైలర్‌లో మీరు చూసింది 10 శాతమే. ఈ సినిమా గ్యారంటీ హిట్టు. ఇందులో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా కొత్త కథ ఇది’ అని శరత్ కుమార్ చెప్పారు. ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ, ‘ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రదీప్, మమత బైజు, శరత్ కుమార్ ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మ్ చేశారు. సాంగ్స్ పెద్ద హిట్. సాయి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ కీర్తి చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు’ అని తెలిపారు. ‘ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ప్రదీప్‌తో ఇది మాకు రెండో సినిమా. డ్రాగన్‌తో పెద్ద హిట్ కొట్టాం. అంతకుమించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి చెప్పారు.
‘డ్యూడ్’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి
- Advertisement -
- Advertisement -