Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్రంతో ఎలాంటి చర్చలుండ‌వ్‌

కేంద్రంతో ఎలాంటి చర్చలుండ‌వ్‌

- Advertisement -

పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను బేషరతుగా విడుదల చేయాలి
సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేలా మోడీ సర్కార్‌ దృష్టిపెట్టాలి : లేహ్‌ అపెక్స్‌ బాడీ డిమాండ్‌

లేహ్‌: లడఖ్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడే వరకు హౌం మంత్రిత్వ శాఖ యొక్క హై పవర్డ్‌ కమిటీతో చర్చలకు దూరంగా ఉంటామని లేహ్‌ అపెక్స్‌ బాడీ సోమవారం ప్రకటించింది. ”లడఖ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, లడఖ్‌లో శాంతి పునరుద్ధరించబడనంత వరకు, ఎటువంటి చర్చలలో పాల్గొనబోమని ఏకగ్రీవంగా అంగీకరించాం” అని లేహ్‌ అపెక్స్‌ బాడీ చైర్మెన్‌ తుప్‌స్టాన్‌ చెవాంగ్‌ తెలిపారు. నిర్బంధించిన పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ , ఇతరులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (కేడీఏ) సోమవారం డిమాండ్‌ చేసింది. లడఖ్‌ రాష్ట్ర హౌదా, ఇతర ప్రధాన డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం విఫలమవడమే కాదు.. హిమాలయ ప్రాంత ప్రజలను టార్గెట్‌ చేయటాన్ని మోడీ ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించింది.

ప్రధాని మోడీ ”ప్రజాస్వామ్యం భారతీయుల డీఎన్‌ఏలో ఉందని మాట్లాడుతున్నప్పుడు.. లడఖ్‌ ప్రజాస్వామ్యాన్ని డిమాండ్‌ చేయడంలో తప్పు ఏమిటి?” అని ప్రజాసంఘాలు నిలదీస్తున్నాయి. లేహ్‌ హింసవెనుక ఎవరున్నారు..వాస్తవాలపై నిష్పాక్షిక న్యాయ విచారణ జరపాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లడఖ్‌ రాజధాని లేహ్‌లో ఎటుచూసినా ఆంక్షల నీడల్లో ప్రజల్ని కట్టడి చేయాలనుకోవటం తగదని పేర్కొన్నాయి. లేహ్‌ హింస వెనుక ఎవరున్నారు.. వాస్తవాలపై నిష్పాక్షిక న్యాయ విచారణ జరపాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లడఖ్‌ ప్రజల దృష్టి మరల్చడంతో పాటు విధాన చర్చల నుంచి వారిని దూరంగా ఉంచడానికి అధికారులు పండుగలను ఉపయోగిస్తున్నారని స్థానిక ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. లడఖ్‌లో గిరిజన గుర్తింపును కాపాడు కోవటంతో పాటు ప్రజాస్వామ్య హక్కులకోసం ఎంతకైనా పోరాడుదామని స్పష్టం చేశాయి.

కర్ఫ్యూ నీడలోనే..
లేహ్‌ లో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) భద్రత
లేహ్‌ లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కర్ప్యూ నీడలోనే ఆరో రోజూ కొనసాగింది. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) భద్రత బలగాల కనుసన్నల్లోనే జనం బతకాల్సివస్తోంది. కొద్దిసేపు ఆంక్షలు సడలిస్తున్నది. లడఖ్‌కు రాష్ట్రహౌదాతో పాటు పలు డిమాండ్లపై మోడీ సర్కార్‌ నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -