Tuesday, November 25, 2025
E-PAPER
Homeసినిమాఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు

ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు

- Advertisement -

రామ్‌ పోతినేని నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’.మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ బాబు పి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మహేష్‌ బాబు సోమవారం మీడియాతో ముచ్చటించారు.
”ఆంధ్ర కింగ్‌ తాలూకా’ టైటిల్‌కి చాలా మీనింగ్‌ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. సౌత్‌ ఇండియాలో హీరోలని మన జీవితంలో ఒక అంతర్భాగంగా చూస్తాం. అందులో నాకు చాలా ఎమోషన్స్‌ కనిపించాయి. అలా హీరో, అభిమాని రిలేషన్‌లో ఒక కథ చెప్పొచ్చు అనిపించింది. ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్‌కి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. హీరో రామ్‌ కథ విని ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఒక ఫ్యాన్‌ ఎలా బిహేవ్‌ చేస్తాడో, ఎంత మాస్‌గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్‌ కావాలి. ఇలాంటి క్యారెక్టర్‌కి రామ్‌ పర్ఫెక్ట్‌. భాగ్యశ్రీ పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. సూపర్‌స్టార్‌గా ఉపేంద్ర నటన అత్యద్భుతం. ముఖ్యంగా రామ్‌, ఉపేంద్ర మధ్య జరిగే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి’ అని మహేష్‌బాబు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -