Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంఅజిత్ పవార్ మరణం వెనుక కుట్ర ఉంది: మమతా బెనర్జీ

అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర ఉంది: మమతా బెనర్జీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ ఘొక విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బుదవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్‌పవార్‌తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్‌ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు.

కాగా జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు వరుస ప్రజా ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించ డానికి పవార్ ముంబై నుండి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరారు. ఈ విమానం దిగుతున్న సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే థ్రెషోల్డ్ దగ్గర క్రాష్-ల్యాండ్ అయిందని డీజీసీఏ ప్రకటించింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఈ విమానం ముక్కలుగా విడిపోయింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి DGCA అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అజిత్‌ పవార్‌ అస్తమయంపై పలువరు రాజకీయ ప్రముఖకులు,ఇతరులు పలువురు తీవ్ర విచారం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -