యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ నిర్మాతలను సంప్రదించి, విడుదల తేదీపై క్లారిటీ తీసుకోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై వచ్చిన రూమర్స్‌కి చెక్ పెట్టారు.
సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని, నిర్మాతలు ప్రకటించినట్లే మార్చి 19, 2026కే విడుదలవుతుందని తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా విఎఫ్‌ఎక్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా 140 రోజులు మాత్రమే ఉన్నాయని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తున్న ఈ సినిమా ఇంగ్లీష్, కన్నడలో తెరకెక్కుతోంది. దీన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఎటువంటి మార్పు లేదు..
- Advertisement -
- Advertisement -



